కనిగిరి పట్టణంలో ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షల్లో శాస్త్ర చికిత్సలు అవసరమైన వృద్ధులను వైద్యులు గుర్తించారు. రెండు ప్రత్యేక వాహనాల్లో వృద్ధులను సోమవారం గుంటూరు శంకర నేత్ర వైద్యశాలకు ఉచిత కంటి శాస్త్ర చికిత్సల కోసం తరలించారు. ఆపరేషన్లు అవసరమైన వారిని దశలవారీగా గుంటూరుకు తరలించే ప్రయత్నాలను ఎమ్మెల్యే ఉగ్ర చేపట్టారు.