ప్రకాశం జిల్లా మార్కాపురంలో జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్థానిక పాత్రికేయులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఫలహారాలు పంపిణీ చేశారు. పాత్రికేయులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని స్థానిక పాత్రికేయుల సంఘం అధ్యక్షులు అన్నారు. భవిష్యత్తులో కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాత్రికేయులు అన్నారు.