కంభం మండలంలోని ఎన్ఆర్ తురిమెళ్ళ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు బి. మాల్యాద్రి,
కె. శర్వాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, గణితంలో చతుర్విధ ప్రక్రియలను, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ క్షుణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల క్రియాశీలక బోధనా పద్ధతులను అభినందించారు.