గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ మొర్రి పిచ్చయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గిద్దలూరులోని శాఖా గ్రంధాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన రంగనాథన్, నాగభూషణం, వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. అలాగే వారు చేసిన సేవలను కొనియాడారు.