దర్శి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప నిర్మాణ పనులను ఆదివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2025 అక్టోబర్ నాటికి కల్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.