ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంధాలయంలో గురువారం 57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారులు తులసి మల్లికార్జున నాయక్ మరియు తేలుకుట్ల రాజశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. శ్రీనివాసులు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.