వైసిపికి బాలినేని రాజీనామా
ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైయస్సార్సీపి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. కొంతకాలంగా వైఎస్ జగన్ పై, పార్టీ పై అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం లేదు. రాజీనామాతో జిల్లా వ్యాప్తంగా రాజకీయం ఒక్కసారిగా మారింది.