సొంత పార్టీలో నాకు అన్యాయం జరిగింది: బాలినేని
వైసిపికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మాజీ మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రేమతో ఇన్నాళ్లు పార్టీలో కొనసాగానని తెలిపారు.