ఒంగోలు నగరం పరిధిలోని పెళ్లూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ గ్రామంలో పర్యటిస్తున్నారని, రూ.30లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం గ్రామస్తులతో ట్లాడనున్నారన్నారు.