విద్యావేత్త అంజిరెడ్డి సేవలు నిరుపమానం

54பார்த்தது
విద్యావేత్త అంజిరెడ్డి సేవలు నిరుపమానం
విద్యావేత్త బూచి అంజిరెడ్డి విద్యారంగానికి చేసిన సేవలు నిరుపమానమని అసోసియేషన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. బిఏ అండ్ కెఆర్ విద్యాసంస్థల పూర్వ చైర్మన్ బూచి అంజిరెడ్డి వర్ధంతి సభ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. మంగళవారం ఒంగోలు బాలాజీ నగర్ లోని బిఏ కేఆర్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విద్యావేత్త, న్యాయవాది డాక్టర్ నూకతోటి రవికుమార్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రకాశం జిల్లా విద్యారంగా ఉన్నతిలో అంజిరెడ్డి బి ఏ కే ఆర్ విద్యాసంస్థల ద్వారా చేసిన సేవలు చరితార్ధమైనవని అన్నారు.

தொடர்புடைய செய்தி