కనిగిరి మున్సిపాలిటీలో నీటి సమస్యను తీర్చడమే తన లక్ష్యమని మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సమస్య పరిష్కార కార్యక్రమంలో భాగంగా సోమవారం కనిగిరి కొండపై శివాలయంవద్ద ఉన్న ట్యాంకు ప్రాంతాన్ని పరిశీలించారు. బోర్లు ఎండిపోవడం వలన నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త బోరును ఏర్పాటు చేసి నీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు.