పామూరు: ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే

52பார்த்தது
పామూరు: ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పామూరులో శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పామూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో వారిని సన్మానించారు.

தொடர்புடைய செய்தி