అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేసినట్లుగా పామూరు ఎస్సై కిషోర్ తెలిపారు. పామూరు పట్టణంలో ఓ మహిళ వద్ద నుండి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయించినా, తరలించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దని తెలిపారు.