కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర పాల్గొన్నారు.