బంగారు బాల్యం వారోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయిలో స్లొగన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కనిగిరిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని షేక్ అయేషా ప్రతిభ చాటారు. జిల్లా స్థాయిలో రెండవ స్థానం దక్కించుకున్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ చేతులమీదుగా గురువారం రాత్రి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని జిల్లా కలెక్టర్, ఎస్పీ అభినందించారు.