కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో త్వరలో రామతీర్థం జనాలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లుగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి-పొదిలి మధ్యలో గల చిన్నారికట్ల పంపు హౌస్ ను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. కొన్ని సంవత్సరాలుగా రామతీర్థం జలాశయాలు కనిగిరి మున్సిపాలిటీకి సరఫరా కాకుండా నిలిచిపోయాయని, కానీ పనులను పునరుద్ధరించి, ప్రజలకు సురక్షిత జలాలు అందిస్తామని తెలిపారు.