టిట్కో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జివి కొండారెడ్డి తెలిపారు. కనిగిరిలోని సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్యంతోనే పేదల సొంతింటి కళ నెరవేరలేదన్నారు. టిట్కొ ఇళ్ల పై ప్రభుత్వం దృష్టి సారించాలని, వెంటనే లబ్ధిదారులకు అందించాలని తెలిపారు.