ప్రకాశం జిల్లా, కంభం వెలుగు కార్యాలయంలో అవినీతి జరుగుతోందని సీపీఎం నాయకుడు ఇబ్రహీం ఆరోపించారు. వీఏవోలకు పదవీ కాలం 3 ఏళ్లే అయినప్పటికీ స్థానికంగా 5 ఏళ్లు దాటినా బదిలీ చేయడం లేదన్నారు. వారికీ రిలీవ్ ఆర్డర్ వచ్చినా రాజకీయ పలుకుబడితో బదిలీ కావడం లేదని విమర్శించారు. భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని గురువారం మీడియాకు వెల్లడించారు.