ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో పలు రెస్టారెంట్లను శనివారం ఎస్ఐ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెస్టారెంట్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రెస్టారెంట్లలో కస్టమర్లు మద్యం సేవించే విధంగా వ్యవహరిస్తే యాజమాన్యులపై కేసులు నమోదు చేస్తావని ఎస్సై హెచ్చరించారు. మద్యం విక్రయించడం లేదా రెస్టారెంట్లలో మద్యం నిలువ ఉంచడం వంటివి చేస్తే కఠినంగా వ్యవహరిస్తావని నరసింహారావు అన్నారు.