సాలూరు: తహశీల్దార్ కార్యాలయం ముందు పాల ధర తగ్గింపుపై నిరసన
విశాఖ డెయిరీ యాజమాన్యం రైతుల నుంచి సేకరిస్తున్న లీటర్ల పాల ధర తగ్గింపునకు నిరసనగా పాచిపెంట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎపి పాల రైతుల సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల రైతుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ లీటరుకు పాలకు కనిష్టధరపై పది రూపాయలు అదనంగా చెల్లించాలని, లీటర్ పాలుకు ప్రోత్సాహక ధర ఎనిమిది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.