రాష్ట్రంలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదివారం కౌంటర్ ఇచ్చారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బాంబులు పేలబోతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలలో వ్యవధిలో ప్రభుత్వం కూలడం ఖాయమని జోస్యం చెప్పారు.