పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన కే. హేమలత సేవలు చిరస్మరణీయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. బదిలీపై వెళ్తున్న హేమలతకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ అధికారిగా డివిజన్లో మంచి సేవలను అందించారని కొనియాడారు.