ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శ యమ్మల మన్మధరావు, కోశాధికారి గొర్రెల వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఇందిర ప్రకటనలో శుక్రవారం డిమాండ్ చేశారు. ముఖ్యంగా వాలంటీర్లకు గత రెండు నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వాటిని ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారని, నెరవేర్చాలని డిమాండ్ చేశారు.