పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ రవీంద్ర రాజు ఆధ్వర్యంలో గురువారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజలు అధికంగా గుమిగూడిన ప్రదేశాల్లో ఒకటైన ఆర్టీసీ కాంప్లెక్స్ లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీస్ లను సంప్రదించడానికి గాను డయల్ 100 గురించి వివరించడం జరిగింది.