పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టము, భామీని మండలాల్లో వివిధ గ్రామాలలో ఖరీప్ సీజన్ వరినాట్లు ఊపందుకున్నాయి. గురువారం కోందరు రైతులు ఎద పద్దతిలో సాగు చేస్తుంటే. మరికోందరు సంప్రదాయ పద్దతిలో నాట్లు వేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అధికారులు రైతుల చేత లైన్ సోయింగ్ విధానంలో వరిసాగు చేయిస్తున్నారు. ఈ విధానంలో చీడపీడల తాకిడి తక్కువగా ఉండటంతో. పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.