రాష్ట్ర మార్క్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన కర్రోతు బంగారు రాజు నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా కూటమి నాయకులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తమ అభినందనలు తెలిపారు.