మన్యం: మద్యం షాపుల్లో స్థానిక గిరిజనులకే ప్రాధాన్యత
షెడ్యూల్డ్ ప్రాంత మండలాల్లోని మద్యం షాపుల్లో స్థానిక గిరిజనులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మన్యం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా షెడ్యూల్డ్ ఏరియాలోని మద్యం షాపులకు ప్రభుత్వం విధి విధానాలను, మార్గదర్శకాలను జారీ చేసిందని అన్నారు. స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులని అన్నారు.