మన్యం జిల్లా
కురుపాం ఎమ్మెల్మే తోయక జగదీశ్వరీని గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విధులు, ప్రమోషన్, జాబ్ చార్జ్ గురించి ఆమెతో చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.