గ్రేటర్ హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీల్లోకి అక్కడున్న సమీప గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌ను బాహ్యవలయ రహదారి వరకూ విస్తరించే క్రమంలో శివారు మున్సిపాలిటీలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో శివారు మున్సిపాలిటీల్లో 51గ్రామాలను కలిపేందుకు రెండునెలల క్రితం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇందులోని అంశాలకు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు నుంచి చర్యలు చేపట్టారు