ఏపీకి వాయుగుండం ముప్పు.. అతి భారీ వర్షాలు

83பார்த்தது
ఏపీకి వాయుగుండం ముప్పు.. అతి భారీ వర్షాలు
AP: దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி