విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం నరవ గ్రామంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జామి జగన్నాధంకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే గ్రామంలో త్రాగునీటి సమస్యను, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు.