సొంత తుపాకీ పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్లోని ధర్మపురికాలనీకి చెందిన పాల్వాయి ఆర్యన్రెడ్డి (23) జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. అదే రోజు తన తుపాకీని శుభ్రం చేసే సమయంలో మిస్ఫైర్ అయ్యి ఆర్యన్ మృతి చెందాడు.