విజయనగరం జిల్లా, గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈవో ప్రార్థన సమయానికి విచ్చేసి పరిశీలించారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.