అభివృద్ధిని ఆదర్శంగా నిలపడమే కూటమి లక్ష్యమని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం మధ్యాహ్నం బొండపల్లి మండలంలోని మరువాడ గ్రామంలో సిసి రహదారికి మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సర్పంచులు డోకుల పార్వతి, కర్రోతు శ్రీనివాసరావు, బొడ్డు రాము తదితరులు పాల్గొన్నారు.