తమ డిమాండ్లు పరిష్కరించాలని పిరిడీ పీహెచ్ సీ 104 సిబ్బంది శనివారం పిరిడి సర్పంచ్ వరలక్ష్మికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాక కష్టం అవుతుందని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా కేవలము నిర్వహించాలని అన్నారు.