తాడికొండ: నిబంధనలు పాటించాల్సిందే: సీఐ
దీపావళి సామాగ్రి విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని తాడికొండ సీఐ వాసు తెలిపారు. బుధవారం తాడికొండ మండలంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసు, ఫైర్ స్టేషన్ అధికారుల నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు.