దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఆగకపోవడంతో.. వీటి దర్యాప్తులో ఇంటర్పోల్, ఎఫ్బీఐని భారత్ సాయం కోరింది. వీటి వెనక అమెరికాలోని ఖలిస్థానీ గ్రూపుల హస్తం ఉందన్న అనుమానాలు భారత్ దర్యాప్తు బృందాల్లో ఉన్నాయి. గత వారం ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బహిరంగంగానే భారత ప్రభుత్వాన్ని బెదిరించిన విషయం తెలిసిందే. భారత్ విజ్ఞప్తికి అమెరికా ఎఫ్బీఐ కూడా సానుకూలంగా స్పందించింది.