వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఓ చిరు వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని ఆటోనగర్లో పైడి శ్రీధర్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అయితే రోడ్డుపైన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తడంతో మట్టేవాడ ఎస్సై.. రోడ్డుమీద షాప్ నిర్వహించవద్దని హెచ్చరించాడు. దీంతో వ్యాపారానికి ఎస్సై అడ్డు వస్తున్నాడని ఆరోపిస్తూ శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.