ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతిచెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తూ తాజాగా నిధులు విడుదల చేసింది. 2023 డిసెంబరు 7 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి జాబితా సేకరించి రాష్ట్రంలో 15 జిల్లాలకు రూ.6.45 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 44 కుటుంబాలకు రూ.2.20 కోట్లు అందనున్నాయి.