బాణసంచా దుకాణాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తుళ్ళూరు సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం తుళ్లూరు మండలంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కాలుష్య, శబ్ద రహిత, గ్రీన్ దీపావళి నిర్వహించుకోవాలని సూచించారు. నివాసాలు, రద్దీ కూడళ్లలో దుకాణాలు. ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద అగ్ని నిరోధిక సిలిండర్లు, ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.