మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం మాచర్ల పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపం లో జరిగిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందరోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించారు.