ఈనెల 4వ తేదీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మాడ్ ప్రాంతం తెల్తులి-నెండూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ రాజ్యాంగ వ్యతిరేకమని పిడిఎం నాయకులు ఆరోపించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు వీటిపై సుప్రీం కోర్ట్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. బుధవారం నరసరావుపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 10 నెలలలో 200 మంది మావోయిస్టులు చనిపోతే చట్ట ప్రకారం జరగవలసిన న్యాయ విచారణకు ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు.