తిరుమలకు జగన్ రావొద్దని మేం అన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్లే స్వేచ్చ ఉంది. ఇతర మతాలకు సంబంధించిన వారెవరైనా తిరుమలకు వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలి, గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ సాంప్రదాయాలను పాటించడం ఎన్నో దేవాలయాల్లో ఉంది. తిరుమలకు రావొద్దని జగన్ కు ఎవరూ చెప్పలేదు అని అన్నారు.