ఏ. కొండూరు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

76பார்த்தது
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సోమవారం వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని ఏ కొండూరు మండలం గోపాలపురం తండాలో ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. తండాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ కోల శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி