జనసేన పార్టీ విజయం దక్కించుకున్న 21 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నాయకులే ముందంజలో ఉండాలి. అయితే రాజకీయాలు రాజకీయాలే. సో.. ఈ వ్యవహారంలో వారు వెనుకబడిపోతున్నారు. తమ్ముళ్లదే పైచేయిగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు నియోజక వర్గాల్లో తమ్ముళ్లు పెత్తనం చేస్తున్నారు. అక్కడ గెలిచింది మాత్రం జనసేన.. అధికారం మాత్రం టీడీపీది. అయితే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులతో కలిసి జనసేన ఎమ్మెల్యేలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.