నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాసనగర్ లో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు వద్ద ఐద్వా నాయకులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో మద్యం షాప్ ఏర్పాటు చేయటం వల్ల తమ అనేక ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. స్థానిక పోలీసు తోపాటు ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారికి తమ సమస్యను తెలియజేశారు.