ఎమ్మిగనూరులోని హోటల్స్ మరియు దుకాణాలపై శనివారం మున్సిపల్ కమిషనర్ తనిఖీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్స్ వాడకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎమ్మిగనూరులో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకపోతే జరిమానా విధిస్తామన్నారు.