ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్య శాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పేద ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలను ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర బాబు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. జర్నలిస్టులు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు.