పెద్దకడబూరు: దళిత గోవిందమ్మకు మద్దతుగా పదోవ రోజుకు చేరుకున్న దీక్ష

51பார்த்தது
పెద్దకడబూరు మండలం కల్లుకుంట దళిత మహిళ గోవిందమ్మ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో చేపట్టిన దీక్ష నేటితో 10వ రోజుకు చేరుకుంది. బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమ్రేశ్ సంఘీభావం తెలిపారు. దళిత మహిళ అని చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా అగ్రకులస్థులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி