పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో, దుర్గాపురం ప్రాంతంలో స్థానిక వాటర్ ట్యాంక్ సమీపంలో అక్రమంగా చర్చి నిర్మాణం జరుపుతున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు ఎంపీడీవో, రెవెన్యూ అధికారులకు మంగళవారం పిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు.